Karthika Deepam2 : ఫోరెన్సిక్ రిపోర్ట్ చూసి అంతా షాక్.. ఆ గన్ పేల్చింది ఎవరు?
on Apr 30, 2025
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -344 లో... దీపని కలవడానికి అనసూయ జైలుకి వస్తుంది. ఇక శౌర్యకి తల్లి అయిన తండ్రి అయిన కార్తీక్ బాబే నేను బయటకు వస్తానన్న నమ్మకం నాకు లేదని దీప అంటుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. తల్లి అయినా తండ్రి అయినా నేనే అనేవరకు ఒకే కానీ అలా శౌర్య కూడా అనుకోవాలి కదా అని కార్తీక్ అంటాడు.
అయితే ఇప్పుడు నేను శౌర్యకి వేరొక అమ్మని తీసుకొని రావాలా అని కార్తీక్ అనగానే కార్తీక్ బాబు అని అనసూయ అంటుంది. ఇప్పుడు దీప మాట్లాడుతున్న మాటలకి సారాంశం అదే అనసూయ గారు అని కార్తీక్ అంటాడు. పోనీ నువ్వే ఒక అమ్మాయిని చూసి పెళ్లి చెయ్ అని కార్తీక్ వెటకారం గా మాట్లాడతాడు అసలు నువ్వు బయటకు రావు అని చెప్పింది ఎవడు.. నా భార్యని బయటకు తీసుకొని వస్తాను. నా కూతురికి మాటిచ్చాను. మీ అమ్మని బయటకు తీసుకొని వస్తానని అని కార్తీక్ అంటాడు. అనసూయ గారు మీరు వెళ్ళండి దీపతో నేను కోర్ట్ కి వెళ్తాను. నిర్ధోషి గా బయటకు తీసుకొని వస్తానని కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే బోన్ లో దీప ఉంటుంది. శివన్నారాయణని కళ్యాణ్ ప్రసాద్ బోన్ లోకి పిలిచి మాట్లాడతాడు.
దీపకి వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నట్లు తనకి జీవితకాలం జైలు శిక్ష విధించినట్లు జ్యోత్స్న ఉహించుకుంటుంది. ఏంటి కల కంటున్నావా ఇంకా తీర్పు ఇవ్వలేదని పారిజాతం అంటుంది. ఇన్స్పెక్టర్ వచ్చి జడ్జ్ కి ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇస్తాడు. గన్ పై వేలిముద్రలు దీపవే కానీ దీప పట్టుకున్న గన్ లో బుల్లెట్ దశరత్ ని కాల్చింది కాదు. అది వేరే బుల్లెట్ అని జడ్జ్ రిపోర్ట్ ని చూసి చెప్పగానే అంత షాక్ అవుతారు. దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది జ్యోత్స్న డిస్సపాయింట్ అవుతుంది. ముందు నుండి చెప్తుంది అదే దీప చేతిలోని గన్ పేలలేదు వేరొక గన్ పేలింది. అది పేల్చింది ఎవరు అని కళ్యాణ్ ప్రసాద్ అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



